తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ & ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఉద్యోగాలు

తెలంగాణ పబ్లిక్‌ హెల్త్‌ & ఫ్యామిలీ వెల్ఫేర్‌లో ఉద్యోగాలు


తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ (డిఒపిహెచ్‌ఎఫ్‌డబ్ల్యు)- రెగ్యులర్‌ ప్రాతిపదికన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ 521, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్స్‌ 7

అర్హత: సివిల్‌ సర్జన్‌ అభ్యర్థులు ఎంబిబిఎస్‌, డెంటల్‌ అభ్యర్థులు బిడిఎస్‌ను పూర్తిచేసి ఉండాలి.

వయసు: జూలై 1 నాటికి 44 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తుప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 20

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2018 జనవరి 18

వెబ్‌సైట్‌: http://dophfw.cgg.gov.in

ఢిల్లీ పోలీస్‌ ఉద్యోగాలు

ఢిల్లీ పోలీస్‌ ఉద్యోగాలు


ఢిల్లీ పోలీస్‌ – పలు ట్రేడ్స్‌లో మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ పోస్టుల భర్తీకి పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 707

పోస్టులు: కుక్‌ 253, వాటర్‌ క్యారియర్‌ 54, సఫాయి కర్మచారి 237, కోబ్లర్‌ 14, దోబీ 68, టైలర్‌ 16, డాఫీ్ట్ర 3, మాలి 16, బార్బర్‌ 39, కార్పెంటర్‌ 7

అర్హత: పదోతరగతి లేదా సంబంధిత ట్రేడ్‌లో ఐటిఐ పూర్తిచేసి ఉండాలి.

వయసు: 2018 జనవరి 16 నాటికి 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రిటెన్‌ టెస్ట్‌, ట్రేడ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌ ద్వారా. దరఖాస్తు ఫీజు: రూ.100

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: డిసెంబరు 17 నుంచి

దరఖాస్తుకు ఆఖరు తేదీ: 2018 జనవరి 16

వెబ్‌సైట్‌: http://www.delhipolice.nic.in

గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌

గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌


గూగుల్‌.. ఇంటర్నెట్‌ ప్రపంచాన్ని మకుటం లేని మహారాజుగా ఏలుతున్న సెర్చ్‌ ఇంజిన్‌. ఇంటర్నెట్‌లో ఎటువంటి సమాచారం కోసమైనా ముందుగా సెర్చ్‌ మొదలు పెట్టేది గూగుల్‌తోనే. ఒక క్లిక్‌తో సెకన్ల వ్యవధిలోనే లక్షల పేజీల ఇన్ఫర్మేషన్‌ను అందుబాటులోకి తేవడం గూగుల్‌ స్టైల్‌. కేవలం బ్రౌజింగ్‌ లోనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమ ఎంప్లాయి ఫ్రెండ్లీ ఆఫీస్‌లలో ఏటా గూగుల్‌ నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో నిలుస్తోంది. మారుతున్న ట్రెండ్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు నూతన అప్లికేషన్స్‌ను డెవలప్‌ చేస్తూ టెక్‌ వరల్డ్‌లో ఒక వండర్‌గా నిలుస్తోంది గూగుల్‌. అటువంటి దిగ్గజ సంస్థ నుంచి ఇంటర్న్‌షిప్‌ చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ ఆఫర్‌ లెటర్‌తో మీ ముందు క్యూ కడతాయి. అయితే గూగుల్‌ నుంచి ఇంటర్న్‌షిప్‌ ఎలా, ఎక్కడ, ఏవిధంగా చేయాలి అనే అంశాలను తెలుసుకుందాం

గూగుల్‌… సెర్చ్‌ ఇంజిన్‌ మార్కెటింగ్‌లో వరల్డ్‌ నెంబర్‌ వన్‌. ఈ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో ఆఫీసులు ఉన్నాయి. అత్యాధునిక హంగులు, టెక్నాలజీని సరికొత్త పుంతలు తొక్కించే దిశగా నిరంతర పరిశోధనలు వంటివి గూగుల్‌ కార్యకలాపాలు (ఉదాహరణకు డ్రైవర్‌లెస్‌ కారు). టెక్నాలజీ పరంగా ప్రపంచం కంటే ఒక అడుగు ముందు ఉండే గూగుల్‌ నుంచి ఇంటర్న్‌షిప్‌ చేయడాన్ని విద్యార్థులందరూ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారు. ఎందుకంటే ప్రపంచంలోని ప్రతిభావంతులైన విద్యార్థుల నుంచి ద బెస్ట్‌ అని నిరూపించుకున్న వారికి మాత్రమే ఈ అవకాశం దక్కుతుంది. గూగుల్‌ నుంచి ద బెస్ట్‌ అనే ట్యాగ్‌ కెరీర్‌ పరంగా మిమ్మల్ని ఎవరెస్ట్‌ శిఖరంపైనే నిలబెడుతుందనడంలో సందేహం లేదు.

 ఏయే విభాగాల్లో..?

గూగుల్‌ రెండు విభాగాల్లో ఇంటర్న్‌షిప్‌ ఆఫర్‌ చేస్తుంది. అవి.. టెక్నికల్‌ ఇంటర్న్‌షిప్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇంటర్న్‌షిప్‌. కంప్యూటర్‌ సైన్స్‌ లేదా సంబంధిత విభాగాలకు చెందిన గ్రాడ్యుయేట్‌, పోస్టుగ్రాడ్యుయేట్‌, పీహెచ్‌డీ విద్యార్థులు ఈ ఇంటర్న్‌షిప్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులే కాకుండా ఇతర స్ర్టీమ్‌ విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది. అయితే వారికి కోడింగ్‌, అల్గోరిథమ్స్‌పై మంచి అవగాహన ఉండాలి. గ్రాడ్యుయేట్స్‌ సాధారణంగా కోర్సులోని మూడు లేదా నాలుగో సంవత్సరంలో ఇంటర్న్‌షిప్స్‌ కోసం దరఖాస్తు చేస్తారు.

ఎంబీఏ విద్యార్థులు కూడా సమ్మర్‌ ఇంటర్న్‌షిప్స్‌ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి గూగుల్‌ చేపట్టేఅన్ని రకాల కార్యకలాపాల్లో ఇంటర్న్‌షిప్‌ చేసే అవకాశం ఉంటుంది. 10 నుంచి 12 వారాల వ్యవధి ఉండే ఈ ఇంటర్న్‌షిప్స్‌ కోసం ఎంబీఏ విద్యార్థులు కోర్సులోని మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది

దరఖాస్తు ఎప్పుడు?

సమ్మర్‌ ఇంటర్న్‌షిప్స్‌ కోసం ఏటా అక్టోబర్‌ నుంచి జనవరి మధ్య దరఖాస్తు చేసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఫిబ్రవరి నెలకు ముందుగానే ఇంటర్న్‌షిప్స్‌ అన్నీ భర్తీ చేస్తారు. కాబట్టి ముందుగానే దరఖాస్తు చేసుకోవాలి.

 ఆన్‌లైన్‌లో…

ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి (వెబ్‌సైట్‌: https://summerofcode.withgoogle.com/). ఇందుకు రెజ్యూమె (పీడీఎఫ్‌ రూపంతోపాటు ట్రాన్స్‌క్రిప్ట్‌గా కూడా ఉండాలి) ప్రాజెక్ట్‌ ప్రపోజల్‌, చక్కటి కవర్‌ లెటర్‌, మీ విజయాలను చూపే సర్టిఫికెట్స్‌, సంబంధిత డాక్యుమెంట్లను జత చేయాలి. గూగుల్‌ ఎంప్లాయి రిఫరల్‌ ఉండాలి. అయితే అందరికి గూగుల్‌ ఉద్యోగులు తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి వారు లింక్డన్‌, ఫేస్‌బుక్‌ సహాయంతో గూగుల్‌ ఎంప్లాయిస్‌ను గుర్తించి వారి సహాయం తీసుకోవచ్చు. రిఫరల్‌ అనేది కేవలం రెజ్యూమె పోస్టింగ్‌కు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ప్రాసెస్‌ అందరికీ ఒకే రకంగా ఉంటుంది. కాబట్టి రిఫరల్‌ తప్పనిసరి కాదు. ప్రీవియస్‌ గూగుల్‌ ఎంప్లాయి లేదా గతంలో గూగుల్‌ నుంచి ఇంటర్న్‌షిప్‌ చేసిన వారి నుంచి ఆ సంస్థ హెచ్‌ఆర్‌ మెయిల్‌ తెలుసుకుని హెచ్‌ఆర్‌ విభాగానికి నేరుగా కూడా రెజ్యూమెను మెయిల్‌ చేయవచ్చు.

 ఎంపిక విధానం

వచ్చిన రెజ్యూమెలను స్ర్కీనింగ్‌ చేసిన తర్వాత టెక్నికల్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. ఇందులో డేటా స్ట్రక్చర్స్‌, అల్గోరిథమ్స్‌, కోడింగ్‌ మీద ఎక్కువ శాతం ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి లింకడ్‌ లిస్ట్‌, స్టాక్‌, క్యూస్‌, హీప్స్‌, హ్యషింగ్‌, బైనరీ సెర్చ్‌ ట్రీ, బేసిక్‌ గ్రాఫ్‌ ట్రావర్సల్‌, ట్రైస్‌, బిట్‌ మానిప్యులేషన్‌ వంటి డేటా స్ట్రక్చర్స్‌పై అవగాహన కచ్చితంగా ఉండాలి. ఇంటర్వ్యూలను ఫోన్‌, గూగుల్‌ ప్లస్‌, హ్యాంగవుట్స్‌ వంటి మాధ్యమాల ద్వారా లేదా భారత్‌లోని గూగుల్‌ ఆఫీసుల్లో నిర్వహిస్తారు. హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై, గుర్గాంవ్‌లలో గూగుల్‌ ఆఫీసులు ఉన్నాయి.

తర్వాత రెజ్యూమె హైరింగ్‌ కమిటీకి చేరుతుంది. సంబంధిత డాక్యుమెంట్లను రివ్యూ చేస్తారు. హోస్ట్‌ మ్యాచింగ్‌ చివరి దశ. మీరు ఎంచుకున్న విభాగంలో ఖాళీ ఉంటే రెండు – మూడు రౌండ్ల పాటు టెలిఫోనిక్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇది నాన్‌ – టెక్నికల్‌ రౌండ్‌. అభ్యర్థి గుణగణాలు, వర్క్‌ కల్చర్‌, టీం వర్క్‌ సామర్థ్యాలను పరీక్షిస్తారు.

స్టయిఫండ్‌

ఇంటర్న్‌షిప్‌లో మొదటి నెల పూర్తిగా ఆర్గనైజేషన్‌ యాక్టివిటీస్‌పై సమగ్ర అవగాహన కల్పిస్తారు. తర్వాత మూడు నెలలపాటు మోంటార్స్‌ పర్యవేక్షణలో నిర్దేశించిన విధంగా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్‌షిప్‌లో సమయంలో నెలకు రూ.30,000 స్టయిఫండ్‌ లభిస్తుంది. వీటితోపాటు ఆహారం, టీం అవుటింగ్స్‌ అన్నీ ఖర్చులను గూగులే భరిస్తుంది.

 గూగుల్‌ స్పాన్సర్‌ ప్రోగ్రామ్‌

గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌ అనేది గూగుల్‌ స్పాన్సర్‌ చేస్తున్న గ్లోబల్‌ ప్రోగ్రామ్‌. గూగుల్‌ ఇంటర్న్‌షిప్‌ అంటే కచ్చితంగా గూగుల్‌ ఆఫీస్‌లోనే చేయాలని ఏమీ లేదు. సమ్మర్‌ కోడ్‌ ఇంటర్న్‌షిప్‌ కోసం గూగుల్‌ కొన్ని ఆర్గనైజేషన్స్‌ను ఎంపిక చేస్తుంది (వెబ్‌సైట్‌: https://summerofcode. withgoogle.com/organizations/). వాటిల్లో విద్యార్థులు మెంటార్స్‌ సహాయంతో ఇండిపెండెంట్‌గా ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి విద్యార్థులు ఇంటర్న్‌షిప్‌ కోసం ఆయా సంస్థల్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కాకపోతే ఈ ప్రాసెస్‌ను గూగుల్‌ పర్యవేక్షిస్తుంది.

 స్కాలర్‌షిప్‌తో శిక్షణ

ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారతదేశంలో సాంకేతిక నిపుణులను తయారుచేసేందుకు గూగుల్‌ సిద్ధమైంది. ఇందులో భాగంగా 1.3 లక్షల మంది విద్యార్థులకు వివిధ సాంకేతిక అంశాల్లో స్కాలర్‌షిప్స్‌తో కూడిన శిక్షణను అందజేయనుంది. ఇందుకోసం గూగుల్‌ ఆన్‌లైన్‌ ఎడ్యుకేషన్‌ కంపెనీ ప్లూరల్‌ సైట్‌, ఎడ్యుకేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఉడాసిటీ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ప్లూరల్‌సైట్‌ సంస్థ ద్వారా 1,00,000 మందికి, ఉడా సిటీ సంస్థ ద్వారా 30,000 మందికి శిక్షణ ఇస్తారు.

ఈ కార్యక్రమంలో ఆండ్రాయిడ్‌, మొబైల్‌ ఇంటర్‌నెట్‌లకు సంబంధించి వివిధ టూల్స్‌పై అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఉంటుంది. అందులో భాగంగా ఆండ్రాయిడ్‌ డెవలపర్‌, మొబైల్‌ వెబ్‌ స్పెషలిస్ట్‌, క్లౌడ్‌ ఆర్కిటెక్ట్‌, డేటా ఇంజనీర్‌, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, మొబైల్‌ అండ్‌ వెబ్‌ డెవలప్‌మెంట్‌, ఏఆర్‌ / వీఆర్‌, క్లౌడ్‌ ఫ్లాట్‌ఫామ్స్‌ వంటి అంశాల్లో శిక్షణనిస్తారు.

గూగుల్‌, ప్లూరల్‌సైట్‌, ఉడాసిటీ సంస్థల్లోని నిపుణుల పర్యవేక్షణలో ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తద్వారా భవిష్యత్‌లో టెక్నాలజీ రంగంలో ఎదురయ్యే సవాళ్లకు అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు.

అర్హత: గ్రాడ్యుయేషన్‌ స్థాయి కోర్సులో కంప్యూటర్‌ సైన్స్‌ లేదా అనుబంధ బ్రాంచ్‌లో ప్రవేశం పొంది, 18 సంవత్సరాల వయసు ఉండాలి.

ఇంటర్‌నెట్‌ను అందరికీ అందుబాటులోకి తేవడం, స్థానిక భాషల్లో సేవలందించడం లక్ష్యంగా గూగుల్‌ శిక్షణ, నియామకాలు చేపడుతోంది.

ఉడాసిటీలో రిజిస్ర్టేషన్‌కు చివరి తేదీ: జనవరి 31, 2018.

రిజిస్ర్టేషన్‌ లింక్‌: https://in.udacity.com/

డెబిట్ కార్డులతో జరిపే రూ.2 వేల లోపు లావాదేవీ

న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దుతో సతమతమవుతున్న సామాన్య, మధ్య తరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. దేశంలో నగదు రహిత (డిజిటల్) చెల్లింపులను విస్తృతంగా ప్రోత్సహించాలని నిశ్చయించుకున్న ప్రభుత్వం.. దీనిలో భాగంగా డెబిట్ కార్డులతో జరిపే రూ.2 వేల లోపు లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) చార్జీలను విధించబోమని ప్రకటించింది. అన్ని రకాల డెబిట్ కార్డులతో పాటు బీమ్ యూపీఐ/ఏఈపీఎస్‌ల ద్వారా రూ.2,000, అంత కంటే తక్కువ మొత్తాలతో జరిపే లావాదేవీలకు వర్తించే మర్చంట్ డిస్కౌంట్ రేటును వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి రెండేళ్ల పాటు తామే భరించాలని, దీనిని బ్యాంకుల తామే చెల్లించాలని మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=fa8bf1d4a79704&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=fa8bf1d4a79704&origin=http%3A%2F%2Fwww.ntnews.com

Employment card Renewel

హైదరాబాద్ : 17ఏళ్ల క్రితం ఎంప్లాయిమెంట్ కార్డుల గడువు ముగిసిన అభ్యర్థులకు శుభవార్త. ఎంప్లాయిమెంట్ కార్డులను రెన్యువల్ చేసుకునేందుకు మరో అవకాశం కల్పిస్తోంది జిల్లా ఉపాధికల్పనా విభాగం. 2000 సంవత్సరం నుంచి 2017 సంవత్సరం మధ్యలో కార్డును రెన్యువల్ చేయించుకోని వారు తమ ఎంప్లాయిమెంట్ కార్డులను ఈ నెల 31వరకు రెన్యువల్ చేయించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి తెలిపారు. గతంలో కేవలం రెండు మూడు సంవత్సరాల క్రితం గడువు తీరని వారికి మాత్రమే అవకాశం కల్పించేవారని, తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని మొట్టమొదటి సారిగా 17ఏళ్ల క్రితం ఎంప్లాయిమెంట్ కార్డు రద్దయిన వారికి పునరుద్ధరించుకునే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ సదావకాశాన్ని అన్ని జిల్లాల పరిధిలోని ప్రజలు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f26300834ab686c&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f26300834ab686c&origin=http%3A%2F%2Fwww.ntnews.com

Premetric scholarships…

హైదరాబాద్ : వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతులు చదువుతున్న బీసీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల వారు epass.cgg.gov.in వెబ్‌సైట్‌లో సంప్రదించి ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తిచేసిన దరఖాస్తు ఫారాలను సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు సమర్పించాలన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 100 చొప్పున 10 నెలలకు గాను స్కాలర్‌షిప్‌లను మంజూరు చేస్తామన్నారు. దరఖాస్తుతో పాటు విద్యార్థి ఆధార్‌కార్డు, కుల ధృవీకరణపత్రం, బ్యాంక్ పాస్‌బుక్, పాఠశాలలో చదువుతున్నట్లుగా బోనాఫైడ్ సర్టిఫికెట్, రెండు కలర్‌ఫొటోలు, రేషన్‌కార్డు/ ఆహార భద్రతకార్డు జిరాక్స్, తల్లి, తండ్రి ఫోన్ నెంబర్లను జతపర్చాలన్నారు.

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f3b25027a5359b4&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f3b25027a5359b4&origin=http%3A%2F%2Fwww.ntnews.com

Army Jobs- SSC Qualification

-పదోతరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అభ్యర్థులకు అవకాశం -రాతపరీక్ష, స్కిల్/ట్రేడ్ టెస్ట్ ద్వారా ఎంపిక -ఆర్మీ యూనిట్లు/డిపోలలో కొలువులు పుణెలోని సదరన్ కమాండ్ హెడ్‌క్వార్టర్ పలు యూనిట్లు/డిపోలలో ఖాళీగా ఉన్న గ్రూప్ సీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. bannerవివరాలు: ఆర్మీ పరిధిలోని సదరన్ కమాండ్‌లో ఉన్న ఆర్డినెన్స్ యూనిట్లలోని ఖాళీలను ప్రస్తుత ప్రకటనతో భర్తీ చేయనున్నారు. పోస్టులు – ఖాళీల సంఖ్య: -మెటీరియల్ అసిస్టెంట్ – 11 ఖాళీలు -పేస్కేల్: రూ. 5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 2,800/- -లోయర్ డివిజన్ క్లర్క్ – 110 ఖాళీలు -ఫైర్‌మెన్ – 61 -కుక్ – 5 -పై రెండు పోస్టులకు పేస్కేల్: రూ. 5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/- -గ్రేడ్ – 2 స్టెనోగ్రాఫర్ – 2 -పై పోస్టుకు పేస్కేల్: రూ. 5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/- -ట్రేడ్స్‌మెన్ మేట్ – 561 ఖాళీలు -సఫాయివాలా – 26 -మెసెంజర్ – 14 -వాషర్‌మ్యాన్ – 2 -గార్డెనర్ – 1 -ఫిమేల్ సెర్చర్ – 4 -పై పోస్టులకు పేస్కేల్: రూ. 5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/- -ఆర్మరర్ – 2, టెలీ ఆపరేటర్ -2, సడ్లర్ -1, ఫిట్టర్ (ఎంవీ) – 1 -పేస్కేల్: రూ. 5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/- -వెండర్ – 3, బార్బర్ – 1 -పై పోస్టులకు పేస్కేల్: రూ. 5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/- -టిన్ అండ్ కాపర్ స్మిత్ – 1, వెహికిల్ మెకానిక్ -1, టైలర్ – 1, పెయింటర్ అండ్ డెకరేటర్ – 1, కార్పెంటర్ అండ్ జాయినర్ – 3, ఎలక్ట్రీషియన్ – 2 -పై పోస్టులకు పేస్కేల్: రూ. 5,200 – 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/- -వయస్సు: దరఖాస్తు దాఖలు చేసే చివరితేదీ నాటికి గరిష్ఠ వయోపరిమితి 25 ఏండ్లు మించరాదు. మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుకు 18 -27 ఏండ్లు ఉండాలి. -అర్హతలు: ఎల్‌డీసీ పోస్టుకు – ఇంటర్‌తోపాటు నిమిషానికి 35 పదాలు టైపింగ్ చేసే సామర్థ్యం ఉండాలి. హిందీలో అయితే నిమిషానికి 30 పదాలు. -మెటీరియల్ అసిస్టెంట్‌కు – డిగ్రీ/డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్‌మెంట్ ఉత్తీర్ణత. -టెలిఫోన్ ఆపరేటర్ పోస్టుకు పదోతరగతి, పీబీఎక్స్ ఈఎక్స్‌పీ. -మిగిలిన అన్ని పోస్టులకు మెట్రిక్/ సంబంధిత బ్రాంచీలో ఐటీఐ ఉత్తీర్ణత. -ఎంపిక: స్కిల్‌టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాతపరీక్ష -రాతపరీక్ష: జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్‌నెస్ నుంచి 150 ప్రశ్నలు ఇస్తారు. -పరీక్ష కాలవ్యవధి 2 గంటల 20 నిమిషాలు -నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు. -ఎంపిక ప్రక్రియ ఏవోసీ సెంటర్, సికింద్రాబాద్‌లో నిర్వహిస్తారు. -యూనిట్లు/డిపోలవారీగా ఖాళీలు.. వార్ధా – 48, అహ్మదాబాద్ – 3, జోధ్‌పూర్ – 137, సికింద్రాబాద్ – 3, జైసల్మేర్ -50, జస్సీ – 54, బాబినా – 3, సౌఘర్ – 5, భుజ్ – 16, ముంబై – 30, నసిరాబాద్ – 5, ఝాన్సీ – 6, చెన్నై – 152, పుణె – 306 ఖాళీలు ఉన్నాయి. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 21 రోజుల్లో దరఖాస్తు దాఖలు చేయాలి. -వెబ్‌సైట్: http://aocrecruitment.gov.in

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f3990e3c5cbf3a8&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f3990e3c5cbf3a8&origin=http%3A%2F%2Fwww.ntnews.com

Central Government Yearly Jobs Details 

ప్రభుత్వ ఉద్యోగం.. గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ప్రతిఒక్కరి కల.. అందులోనూ కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో కొలువైతే మరీనూ.. ఎందుకంటే మంచి జీతంతోపాటు హోదా, భరోసా, గుర్తింపు లభిస్తుంది కాబట్టి. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఐబీపీఎస్, ఆర్‌బీఐ, ఎల్‌ఐసీ, ఇస్రో, ఎస్‌బీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు క్రమం తప్పకుండా విడుదల చేసే పోస్టులు, వాటి పరీక్షలు, విధానాలకు సంబంధించిన వివరాలు..

సివిల్స్

యూపీఎస్సీ సివిల్స్ క్యాలెండర్‌ను ముందుగానే ప్రకటిస్తుంది. ఆ తేదీలను అనుసరించి నియామక ప్రక్రియ ఉంటుంది. మొత్తం మూడు దశల్లో ఉండే ఈ పరీక్షను దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. -ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. అవి ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూలు. -ఈ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్, ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ వంటి మొత్తం 24 రకాల సర్వీసులలోని పోస్టులను భర్తీ చేస్తారు. డిగ్రీ ఉత్తీర్ణులై, 32 ఏండ్లలోపు ఉన్న అభ్యర్థులెవరైనా అర్హులే.. -ఈ పరీక్షను జనరల్ అభ్యర్థులు 6 సార్లు, ఓబీసీలు 9 సార్లు, ఎస్సీ, ఎస్టీలు ఎన్నిసార్లయినా రాయవచ్చు.CentralJobs

పరీక్ష విధానం

-ప్రిలిమ్స్ (సీశాట్): ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కుల చొప్పున మొత్తం 400 మార్కులు. ఇందులో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. -పేపర్-1: జనరల్ స్టడీస్‌లోని జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యమున్న సమకాలీన సంఘటనలు, భారతదేశ చరిత్ర, భారత జాతీయ స్వాతంత్య్రోద్యమం, భారత-ప్రపంచ భౌగోళిక శాస్త్రం, భారత రాజ్యాంగం-పరిపాలన, ఆర్థిక సామాజిక అభివృద్ధి-సంతులిత అభివృద్ధి, పేదరిక, సామాజిక రంగ పథకాలు, జనరల్ అంశాలైన ఎన్విరాన్‌మెంటల్ ఎకాలజీ, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పులు, జనరల్ సైన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. -పేపర్-2: దీన్ని సీశాట్ (సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్) అంటారు. ఇందులో కాంప్రహెన్షన్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, జనరల్, మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ నుంచి ప్రశ్నలు వస్తాయి. -ఇందులో తప్పనిసరిగా 33 శాతం మార్కులు పొందాలి. -మెయిన్స్: ఇది డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. ఇందులో 9 పేపర్లు ఉంటాయి. మొదటి రెండు పేపర్లలో కలిపి తప్పనిసరిగా 25 శాతం మార్కులు రావాలి. ఈ అర్హత మార్కులు సాధిస్తేనే మిగిలిన 6 పేపర్లను పరిగణనలోకి తీసుకుంటారు. -పేపర్-ఏ: ఇందులో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ఏదైనా భారతీయ భాష నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 300 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. అభ్యర్థి భాషా ప్రావీణ్యతను పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. ఇందులో కనీసం 75 మార్కులు సాధించాలి. -పేపర్-బీ: బేసిక్ ఇంగ్లిష్ ఉంటుంది. 300 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులోకూడా కనీసం 75 మార్కులు స్కోర్ చేయాలి. -ఈ రెండు పేపర్లలో వచ్చే మార్కులను ఫైనల్ ర్యాంకింగ్‌లో పరిగణనలోకి తీసుకోరు. అయితే తప్పనిసరిగా కనీస అర్హత మార్కులు సాధించాలి. -పేపర్-1: జనరల్ ఎస్సే. వ్యాసం రాయాల్సి ఉంటుంది. -పేపర్-2: జనరల్ స్టడీస్-1. ఇందులో ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ ఆఫ్ వరల్డ్ అండ్ సొసైటీ నుంచి ప్రశ్నలు అడుగుతారు. -పేపర్-3: జనరల్ స్టడీస్-2లో గవర్నెన్స్, కాన్‌స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. -పేపర్-4: జనరల్ స్టడీస్-3లో టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్‌మెంట్, బయో డైవర్సిటీ, ఎన్విరాన్‌మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్. -పేపర్-5: జనరల్ స్టడీస్-4లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్. -ఈ ఐదు పేపర్లకు 250 మార్కుల చొప్పున మొత్తం 1250 మార్కులు. -పేపర్-6, 7లు ఆప్షనల్ సబ్జెక్టులు. వీటిని అభ్యర్థులు ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. వీటికి 250 మార్కుల చొప్పున మొత్తం 500 మార్కులు ఉంటాయి. -ఇంటర్వ్యూ: మెయిన్స్‌లోని ఏడు పేపర్లలో ఉత్తీర్ణత సాధించిన వారిని పోస్టుల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఇందులో అభ్యర్థి సామర్ధ్యాన్ని పరీక్షిస్తారు. దీనికి 275 మార్కులు కేటాయించారు.

యూపీఎస్సీ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ప్రధానంగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) భర్తీ చేస్తుంది. ఇది ప్రధానంగా సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్ (ఐఎఫ్‌ఎస్), ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్‌ఎస్), ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ (సీడీఎస్), నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), నేవల్ అకాడమీ (ఎన్‌ఏ), కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ (సీఎంఎస్), ఇండియన్ ఎకనామిక్ సర్వీసెస్ (ఐఈఎస్), ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్), కంబైన్డ్ జియో-సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామినేషన్, సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, సీఐఎస్‌ఎఫ్ (అసిస్టెంట్ కమిషనర్), సీఐఎస్‌ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్స్ (ఎగ్జిక్యూటివ్) ఎల్‌డీసీఈ నియామక పరీక్షలను నిర్వహిస్తుంది. -యూపీఎస్సీ నిర్వహించే ఉద్యోగ పోటీ పరీక్షలకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. -సిలబస్, పరీక్ష విధానం ఉద్యోగాలను బట్టి ఉంటుంది.

సీఎంఎస్

కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, రైల్వేలు, కేంద్రీయ ఆరోగ్య సర్వీసెస్, న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్‌తోపాటు వివిధ విభాగాల్లో మెడికల్ ఆఫీసర్లుగా సీఎంఎస్ (కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్) ద్వారా నియమిస్తారు. ఈ పరీక్ష రాయాలంటే ఎంబీబీఎస్ పూర్తి చేసి, 32 ఏండ్ల లోపు ఉండాలి.

పరీక్ష విధానం

-ఎంపిక విధానం పార్ట్- 1 (కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్), పార్ట్-2 (పర్సనాలిటీ టెస్ట్)గా ఉంటుంది. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. -పార్ట్-1లో రెండు పేపర్లు (500 మార్కులు) ఉంటాయి. ప్రతి పేపర్‌కు 250 మార్కులు. పరీక్ష సమయం రెండు గంటలు. -పేపర్-1లో జనరల్ మెడిసిన్ (96 ప్రశ్నలు), పీడియాట్రిక్స్ (24 ప్రశ్నలు) నుంచి మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. -పేపర్-2లో సర్జరీ, గైనకాలజీ అండ్ ఒబెస్టెట్రిక్స్, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ నుంచి 40 ప్రశ్నల చొప్పున మొత్తం 120 ప్రశ్నలు వస్తాయి. మొత్తం 250 మార్కులు. -ప్రశ్నలు ఎంబీబీఎస్ స్థాయిలో ఉంటాయి. -పార్ట్-2 పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. -సీఎంఎస్ నోటిఫికేషన్ ప్రతిఏడాది మార్చిలో విడుదలవుతుంది.

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f53340b3f5b644&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f53340b3f5b644&origin=http%3A%2F%2Fwww.ntnews.com

CISF CONSTABLE-FIREMEN JOBS

-ఇంటర్ సైన్స్ సబ్జెక్టు అభ్యర్థులకు అవకాశం -పీఈటీ, పీఎస్‌టీ, రాతపరీక్ష ద్వారా ఎంపిక -చివరితేదీ: 2018, జనవరి 11

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో 332 కానిస్టేబుల్ /ఫైర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు: -పోస్టు: కానిస్టేబుల్/ఫైర్ (పురుషులు) -పేస్కేల్: రూ. 21, 700 – 69,100/- పే మ్యాట్రిక్స్ లెవల్ – 3. -మొత్తం ఖాళీల సంఖ్య – 332. రాష్ర్టాల వారీగా ఖాళీలు.. తెలంగాణ – 9, ఆంధ్రప్రదేశ్ – 12, అరుణాచల్‌ప్రదేశ్ – 4, అసోం – 28, బీహార్ – 24, ఛత్తీస్‌గఢ్ – 6, ఢిల్లీ – 4, గుజరాత్ – 15, హర్యానా -6, హిమాచల్‌ప్రదేశ్ – 2, జమ్ముకశ్మీర్ – 12, జార్ఖండ్ – 8, కర్ణాటక – 16, కేరళ – 8, మధ్యప్రదేశ్ – 18, మహారాష్ట్ర – 26, మణిపూర్ – 3, మేఘాలయ – 3, మిజోరం – 1, నాగాలాండ్ – 1, ఒడిశా – 10, పంజాబ్ – 7, రాజస్థాన్ – 17, తమిళనాడు – 17, త్రిపుర – 4, ఉత్తరప్రదేశ్ – 48, ఉత్తరాఖండ్ – 2, పశ్చిమబెంగాల్ – 21 ఖాళీలు ఉన్నాయి. -అర్హతలు: సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్ లేదా తత్సమానకోర్సు ఉత్తీర్ణత. -వయస్సు: 2018, జనవరి 11 నాటికి 18 – 23 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1995 జనవరి 12 నుంచి 2000 జనవరి 11 మధ్య జన్మించి ఉండాలి. -ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. Security-Forceశారీరక ప్రమాణాలు: -కనీసం 170 సెం.మీ. ఎత్తు ఉండాలి. -ఛాతీ 80 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి. -ట్రైబల్, ఆదివాసి, మిజోస్, నాగాస్ అభ్యర్థులు 162.5 సెం.మీ ఎత్తు ఉంటే సరిపోతుంది. ఛాతీ – 77 సెం.మీ., గాలి పీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి. -ఎత్తుకు తగ్గ బరువు, మంచి కంటిచూపు కలిగి ఉండాలి. -దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -చివరితేదీ: జనవరి 11 (సాయంత్రం 5 గంటల వరకు) -వెబ్‌సైట్: https://cisfrectt.in ఎంపిక విధానం: -ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, డాక్యుమెంటేషన్. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్:హైట్ బార్ టెస్ట్‌లో క్వాలిఫై అయిన వారు 24 నిమిషాల్లో 5 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి. -పీఈటీలో అర్హత సాధించినవారికి రాతపరీక్ష నిర్వహిస్తారు. -రాతపరీక్ష: ఓఎంఆర్ బేస్డ్ విధానంలో ఈ పరీక్షను నిర్వహిస్తారు. దీనిలో జనరల్ అవేర్‌నెస్/జీకే, ఎలిమెంటరీ మ్యాథ్స్, అనలిటికల్ ఆప్టిట్యూడ్‌పై ప్రశ్నలు ఇస్తారు. -ప్రశ్నపత్రం హిందీ/ఇంగ్లిష్‌లో ఉంటుంది. -మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. -జనరల్, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు 35 శాతం, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 33 శాతం మార్కులు క్వాలిఫయింగ్‌గా నిర్ణయించారు. -పై అన్ని పరీక్షల్లో అర్హత సాధించినవారికి మెరిట్ ప్రకారం జాబితాను రూపొందించి తుది ఎంపిక చేస్తారు.

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f3f26b1eafa42a8&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f3f26b1eafa42a8&origin=http%3A%2F%2Fwww.ntnews.com

Jobs In HCU- Hyderabad Central University

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి అర్హులైన, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. University-of-Hyderabad-పోస్టు: గెస్ట్ ఫ్యాకల్టీ -ఖాళీల సంఖ్య – 2 -అర్హతలు: ఎంఏ తెలుగుతోపాటు నెట్/సెట్‌లో అర్హత సాధించి ఉండాలి. -దరఖాస్తు: వెబ్‌సైట్‌లో -ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా -ఇంటర్వ్యూ తేదీ: 2018, జనవరి 3 పూర్తి వివరాలకు -వెబ్‌సైట్: http://www.uohyd.ac.in

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f1c9e6ed4443e&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f1c9e6ed4443e&origin=http%3A%2F%2Fwww.ntnews.com