హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తన మూడో వార్షికోత్సవం

-స్త్రీ శిశు సంక్షేమశాఖలో 79 కొలువులతో 99వ ప్రకటన -వైద్యారోగ్య శాఖలో 200 ఉద్యోగాలతో నూరవ ప్రకటన -ఇకపై ప్రతి మూడు నెలలకు ఉద్యోగ సమాచారం -అందుబాటులో ఉద్యోగ సమాచారం వెబ్ సంచిక -ప్రారంభించిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రతిపాదనలో తెలంగాణ సివిల్ సర్వీసెస్ అమలులోకి వస్తే క్యాలెండర్ ప్రకారం ప్రకటనలు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి

TSPSCహైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తన మూడో వార్షికోత్సవం సందర్భంగా నోటిఫికేషన్లలో శతకాన్ని నమోదుచేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 79 సూపర్‌వైజర్ ఖాళీలతో 99వ నోటిఫికేషన్, వైద్యారోగ్య శాఖలో 200 ఉద్యోగాలతో నూరవ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదలచేసింది. దీంతోపాటుగా అభ్యర్థులకోసం ఉద్యోగ సమాచారం పేరుతో ఆన్‌లైన్ ఆధారిత సమాచారం అందుబాటులోకి తెచ్చింది. కమిషన్ ఏర్పడి మూడేండ్లు పూర్తవుతున్న సందర్భంగా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచికను రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సోమవారం నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం (ప్రతిభాభవన్)లో ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ కమిషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 29,757 కొలువుల భర్తీకి 100 నోటిఫికేషన్లను విడుదల చేశామని చెప్పారు. 75 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తి చేసినట్టు తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ పూర్తికానుందన్నారు. 2018లో దాదాపు 3,878 కొలువుల భర్తీకి పలు నోటిఫికేషన్లు రానున్నాయని వెల్లడించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నోటిఫికేషన్లను విడుదల చేసి, జూన్, జూలైలలో నియామక ప్రక్రియలు పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. త్వరలో గురుకులాల్లోని పీజీటీ పోస్టుల భర్తీ పూర్తిచేయనున్నట్టు చైర్మన్ వెల్లడించారు. ఆ తదుపరి టీజీటీ ప్రక్రియను చేపడుతామని చెప్పారు. డిప్యూటీ సర్వేయర్ల ప్రక్రియను జనవరిలో పూర్తి చేయనునున్నట్టు వివరించారు. అన్నిరకాల ఉద్యోగాల భర్తీలో టీఎస్‌పీఎస్సీకి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా చైర్మన్ ఘంటా చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సివిల్ సర్వీసెస్ విషయం ప్రతిపాదనలో ఉందని చెప్పారు. యూపీఎస్సీ, ఆయా రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి వేర్వేరు సిలబస్‌లు ఉండటం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో ఈ సర్వీస్ ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సమావేశంలో స్టేట్ సివిల్ సర్వీస్ ప్రతిపాదన వచ్చిందని చక్రపాణి వివరించారు. ఇప్పటికే ఈ విషయమై మాజీ వీసీ రామకృష్ణయ్య కమిషన్ రూపొందించిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని, అది ఆమోదం పొందగానే తగిన ప్రక్రియ చేపడుతామని చెప్పారు. స్టేట్ సివిల్ సర్వీస్ అమలులోకి వస్తే ప్రతి ఏడాది క్యాలెండర్ ప్రకారం ప్రకటనలు వస్తాయన్నారు. టీఎస్‌పీఎస్సీ వసతుల కొరత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కేంద్రం ఏర్పాటుకు అంగీకరించిందని, తగు సన్నాహాలు జరుగుతున్నాయని చైర్మన్ తెలిపారు. నూతన కార్యాలయం విషయంలో వేచిచూస్తున్నామని పేర్కొంటూ.. ఏపీపీఎస్సీ భవనం ఖాళీ చేస్తే ఆ భవనంలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యోగ సమాచారం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుందని తెలిపారు. నోటిఫికేషన్ల వివరాలు, ఫలితాలు, ఏ అభ్యర్థి ఏ శాఖకు ఎంపికయ్యారు వంటి వివరాలతో ప్రతి మూడు నెలలకోమారు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. త్వరలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నామని, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అభ్యర్థుల సందేహాల నివృత్తి చేయనున్నట్టు తెలిపారు.TSPSC1

టీఎస్‌పీఎస్సీ పనితీరు బాగుంది

పారదర్శకత, వేగం, సాంకేతికతను ఉపయోగించుకొని ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటుగా అవినీతి మకిలి అంటని వేదికగా టీఎస్‌పీఎస్సీ నిలువడం సంతోషకరమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. 18లక్షల మంది అభ్యర్థులు నమోదుచేసుకోవడం ద్వారా టీఎస్‌పీఎస్సీని ఆన్‌లైన్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజీగా తీర్చిదిద్దారని అన్నారు. జాతీయ సంస్థల నుంచి టీఎస్‌పీఎస్సీకి ప్రశంసలు దక్కుతున్నాయని, ఇది తెలంగాణ ప్రజల అదృష్టమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఎజెండా అయిన నీళ్లు, నియామకాల విషయంలో అధికంగా కేసులు నమోదవుతున్నాయన్నారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో జరుగుతున్న ప్రచారంతో నిరుద్యోగులు అపోహలకు గురికావద్దని సూచించారు. టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సీ విఠల్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో నంబర్ వన్‌గా నిలుస్తుంటే.. ఉద్యోగాల భర్తీలో దేశవ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. 2004 నుంచి 2014 వరకు ఏపీపీఎస్సీ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 25,000 ఉద్యోగాలు భర్తీచేయగా.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పది జిల్లాల తెలంగాణలో ఇప్పటికే 29,757 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేసిందని వెల్లడించారు. ఇందులో 5932 ఉద్యోగాలు భర్తీ చేయగా.. 23,953 కొలువుల భర్తీ తుది దశకు చేరిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లే లక్ష ఉద్యోగాల భర్తీలో ఇప్పటికే 60 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఇందులో 35వేల కొలువులు టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. మిగతా ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, విద్యుత్ శాఖ, సింగరేణి, ఆర్టీసీ ద్వారా భర్తీ చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్, సభ్యులు చంద్రావతి, రాములు, మంగారి రాజేందర్, రామ్మోహన్ రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు. TSPSC2

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=fd302519a0587&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=fd302519a0587&origin=http%3A%2F%2Fwww.ntnews.com

Published by

shareinfo2017com

I want to share information to others who need in All criteria.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s