జాతీయ ఆరోగ్య మిషన్లో ఉద్యోగ నియామకాలు

హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ పథకం కింద 965 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో 965 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 500 స్టాఫ్ నర్సు, 233 ఏఎన్‌ఎం, 33 వైద్యాధికారి, ఇతర పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. అయితే.. ఈ పోస్టులను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించడానికి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Advertisements

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ jobs

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చాలెంజింగ్ కెరీర్‌కు చిరునామా. పదోతరగతి నుంచి పీజీ చేసిన వారి వరకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న దేశ రక్షణ విభాగం. మంచి జీతభత్యాలు, ప్రత్యేక అలవెన్స్‌లు, భద్రమైన కొలువులకు నిలయం వైమానిక దళం. ఇందులో పర్మినెంట్, షార్ట్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల కోసం నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) నోటిఫికేషన్ విడుదలైంది. వాటి వివరాలు నిపుణ పాఠకుల కోసం…

AFCAT:

ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్. ఎయిర్‌ఫోర్స్‌లో అన్ని బ్రాంచీల్లో ఆఫీసర్స్ భర్తీకి (మెడికల్, డెంటల్ తప్ప మిగిలినవి) దీన్ని క్యాట్‌ను నిర్వహిస్తారు. దీనిద్వారా ఫ్లయింగ్ బ్రాంచీ (ఎస్‌ఎస్‌సీ), టెక్నికల్ బ్రాంచీ (పీసీ, ఎస్‌ఎస్‌సీ), గ్రౌండ్ డ్యూటీ బ్రాంచీ (పీసీ, ఎస్‌ఎస్‌సీ)లలో పోస్టులను భర్తీ చేస్తారు. -ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి, ఆగస్టుల్లో దీన్ని నిర్వహిస్తారు. వీటికి సంబంధించిన ప్రకటనలు ఏటా డిసెంబర్, జూన్‌లో వస్తాయి. ఏ బ్రాంచీలో ఖాళీలు భర్తీ చేస్తారు ? -ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్), గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్). ఇవే కాకుండా ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ, మెట్రాలజీ బ్రాంచీ ఎంట్రీ (గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్). Airforce

ఎవరు అర్హులు..?

-డిగ్రీ, బీఈ/బీటెక్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు. గ్రౌండ్ డ్యూటీలో అకౌంట్స్‌కు బీకాం, ఎడ్యుకేషన్ విభాగానికి ఎంబీఏ/ఎంసీఏ, ఎంఏ/ఎమ్మెస్సీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు. -అవివాహిత పురుష/ మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. -ఫ్లయింగ్ బ్రాంచీకి 20 – 24 ఏండ్లు, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/నాన్ టెక్నికల్) బ్రాంచీలకు 20 – 25 ఏండ్లు మించరాదు. -శారీరక ప్రమాణాలు: ఎయిర్‌ఫోర్స్ అథారిటీ వారు నిర్ణయించిన నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. వివరాలు సైట్‌లో చూడవచ్చు. -శిక్షణ: 2019, జనవరిలో శిక్షణ ప్రారంభమవుతుంది. హైదరాబాద్ దుండిగల్‌లో శిక్షణనిస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీలకు 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచీలకు 52 వారాలు శిక్షణనిస్తారు. -శిక్షణా కాలంలో నెలకు రూ. 56,100/- ఇస్తారు. -శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకొన్న వారికి ఫ్లయింగ్ ఆఫీసర్ కేడర్‌లో లెవల్ 10 కింద రూ. 56,100 – 1,10,700/- -ఇవేకాకుండా నిర్వహించే విధులను బట్టి ప్రత్యేక అలవెన్స్‌లు ఇస్తారు. వసతి, వైద్యం, క్యాంటీన్, సబ్సిడీలపై రుణాలు, ఎల్‌టీసీ తదితర సౌకర్యాలు ఉంటాయి. -ఆన్‌లైన్ టెస్ట్: ఈసారి ఏఎఫ్‌సీఏటీని ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఇలా నిర్వహించడం మొదటిసారి. ఈ టెస్ట్ రాసే అభ్యర్థులు తప్పనిసరిగా పాన్ కార్డ్ కలిగి ఉండాలి.

ముఖ్యతేదీలు:

-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో -దరఖాస్తు ఫీజు: రూ. 250/- -పరీక్ష కేంద్రం: రాష్ట్రంలో హైదరాబాద్ -సందేహాల నివృత్తికి 1800-11-2448 / Phone number 022-25503105 or 022-25503106 -చివరితేదీ: 2018, జనవరి 14 -వెబ్‌సైట్: https://careerindianairforce.cdac.in or https://afcat.cdac.in .

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f18b9dcee0b251c&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=f18b9dcee0b251c&origin=http%3A%2F%2Fwww.ntnews.com

పాస్‌పోర్ట్ పొందడం ఇక చాలా సులువు

పాస్‌పోర్ట్ పొందడం ఇక చాలా సులువు


ఆన్‌లైన్‌లో నేరుగా దరఖాస్తులు

వారంలోనే ఇంటికి పాస్‌పోర్ట్‌

 

విదేశీ ప్రయాణం మోజు పెరుగుతోంది. దీంతో పాస్‌పోర్ట్‌ దరఖాస్తుల సంఖ్య కూడా ఇదే స్థాయిలో పెరిగిపోతోంది. ఇన్నాళ్లు నిబంధనల ప్రకారం పాస్‌పోర్ట్‌ కోసం నెలల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి.. దీని కోసం భారీగా ఫైరవీలు చేయాల్సి ఉంటుంది. వాటిలో ఏ ఒక్క దానిలోనైనా చిన్న తప్పు దొరికితే ఇక అంతే సంగతి. కథ మళ్లీ మొదటికి వస్తుంది. అన్ని డాక్యూమెంట్లు అందించినప్పటికీ ఇచ్చిన సమాచారాన్ని నిర్ధారించుకోవడానికి పోలీస్‌ విచారణ కోసం నెలల తరబడి  వేచి చూడాల్సి ఉంటుంది. ఇదంతా జాప్యం కావడంతో పాస్‌పోర్టు పొందడం కష్టమయ్యేది. ఇప్పుడు పాస్‌పోర్ట్‌ లబ్ధిదారులకు న్యాయం చేయాలనే సంకల్పంతో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పాస్‌పోర్ట్‌ దరఖాస్తును సులభతరం చేసింది. దరఖాస్తు చేసుకున్న వారంలోనే పాస్‌పోర్ట్‌ చేతికి అందే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పాస్‌పోర్ట్‌ అవసరం ఉన్న వారు ఆన్‌లైన్‌లో కేవలం నాలుగు డాక్యూమెంట్లు పొందపరిస్తే పాస్‌పోర్ట్‌ అందుతుంది. ఇందులో ఆధార్‌కార్డు, ఎలకా్ట్రనిక్‌ ఫొటో ఐడెంటిటీ, పాన్‌కార్డు, లాయర్‌ అఫిడవిట్‌, ఇంటి చిరునామాతో ఉన్న వివరాలు పొందుపరిస్తే ఇందులో సమాచారం ఆధారంగా పోలీస్‌ విచారణ చేపట్టి అందించిన నివేదిక ఆధారంగా పాస్‌పోర్ట్‌ అధికారులు పాస్‌పోర్ట్‌ను జారీ చేస్తారు. ఈ కొత్త నిబంధనలు తొలిసారిగా పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసుకున్న వారికే వర్తిస్తాయి. 

 

పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు చేసు కునే విధానం… 

  • పాస్‌పోర్ట్‌కు కావాల్సినవారు www. passportindia.gov.in వెబ్‌సైట్‌లోఆన్‌లైన్‌ చేసుకోవాలి. 
  • వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత యూజర్‌ ఐడీ వస్తుంది. అందులో లాగిన్‌ కావాలి. పాస్‌పోర్ట్‌ న్యూ ఆప్లై ఆర్‌ వోల్డ్‌ ఉంటుంది.ఇందులో న్యూ ఆప్లైని ఓపెన్‌ చేయాలి
  • సర్‌ నేమ్‌, పేరు, తండ్రి పేరు, పుట్టిన తేది, అడ్రస్‌ నింపాలి
  • చదువు 0-5, 6-10, ఇంటర్‌ ఆపై తరగతులు నింపాలి
  • చదువుకోని వారు కోర్టు నుంచి అఫిడవిట్‌ తీసుకోవాలి.
  • అలాగే బ్యాంక్‌ అకౌంట్‌ కూడా ఓపెన్‌ చేసి లాగిన్‌ చేస్తే రూ.1500 ఆన్‌లైన్‌ ద్వారా, చాలన్‌ ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. 
  • దరఖాస్తు పూర్తి కాగానే అపాయింట్‌మెంట్‌ తేదీతోపాటు పాస్‌పోర్ట్‌ కేంద్రాల వివరాలు ఉంటాయి. అందులో సెంటర్‌ను ఎంపిక చేసుకున్న వెంటనే ఇంటర్వ్యూల కోసం తేదీని ప్రకటిస్తుంది..
  • పాస్‌పోర్ట్‌ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు కేటాయించిన కేంద్రంలో ఇచ్చిన సమయానికి గంట ముందు ఆధార్‌, స్టడీ ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలతో పాటు మూడు జిరాక్స్‌ సెట్‌లను తీసుకొని వెళ్లాలి. 
  • ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తు ఆధారంగా పాస్‌పోర్ట్‌ అధికారులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలించి పూర్తి విచారణ కోసం స్థానిక పోలీసులకు పంపిస్తారు. పోలీసులు ధ్రువీకరణ పత్రాలు, పరిశీలించి చిరునామా ఆధారంగా విచారణ చేపట్టి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కేసుల వివరాలు తెలుసుకుంటారు. కేసులు ఉంటే కేసులకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌ నంబర్‌ను వేసి అందిస్తే పాస్‌పోర్ట్‌ నిలిచిపోతుంది. కేసు లు లేని వారికి వారం రోజుల్లో పాస్‌పోర్ట్‌ను అందిస్తారు. 

పాస్‌పోర్ట్‌ పోయిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చు…

పాస్‌పోర్ట్‌ పొంది వాటిని పోగొట్టుకున్న వారు తిరిగి పాస్‌పోర్ట్‌ పొందే అవకాశాలు కల్పించారు. పాస్‌పోర్ట్‌ పోయిన వారు పోలీస్‌స్టేషన్లలో దరఖాస్తు చేసుకుంటే విచారణ చేపట్టిన పోలీసులు ఇచ్చిన ధ్రువీకరణ పత్రాల ఆధారంగా పత్రిక ప్రకటనలు చేసి వాటితో తిరిగి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే ఎంక్వైరీ చేసి అందిస్తారు. విదేశాలలో జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన వారు పాస్‌పోర్ట్‌ కోసం అక్కడి జైలు అధికారులు అందించిన ఔట్‌ పాస్‌పోర్ట్‌ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి. 

సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు

సోషల్ మీడియాలో పోస్టులకు నో అరెస్టు…

supreme-court-order

సుప్రీంకోర్టు సంచలన తీర్పు…తమకు అనుకూలమైన రాతలను చూసి ఆనందిస్తూ, వ్యతిరేకమైన రాతలను అణచివేస్తూ అరెస్టుల పర్వాన్ని సాగిస్తున్న ప్రభుత్వాలకు చెంపపెట్టు తగిలింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ – 2000 చట్టంలోని సెక్షన్-66Aను కొట్టేస్తూ మంగళవారం (జూన్ 27) సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐటీ యాక్ట్ – 2000లోని సెక్షన్-66A అనేది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించే విధంగా ఉందని, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, జస్టిస్ ఆర్‌ఎఫ్ నారీమన్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు సందర్భంగా పేర్కొంది. పౌరుల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు భంగం కలిగించేవిధంగా ఉన్నందువల్ల ఈ సెక్షన్ చట్టసమ్మతం కాదని ధర్మాసనం తెలిపింది.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో పోస్టులకు సంబంధించి అరెస్టుల విషయంలో పోలీసులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ‘సెక్షన్-66A ద్వారా పౌరుల ఆలోచనా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛపై నేరుగా ప్రభావం పడుతోంది. ఒక వ్యక్తికి అభ్యంతరకరమైంది మరో వ్యక్తికి అభ్యంతరకరం కాకపోవచ్చు. మన రాజ్యాంగం.. పౌరులకు స్వేచ్ఛ, ఆలోచనలను వ్యక్తీకరించే హక్కును ప్రసాదించింది. వీటికి భంగం వాటిల్లేవిధంగా ఎలాంటి నిబంధనలను అంగీకరించేది లేదు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో ఈ సెక్షన్‌ను పూర్తిగా కొట్టేస్తున్నట్లు తెలిపింది.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తన మూడో వార్షికోత్సవం

-స్త్రీ శిశు సంక్షేమశాఖలో 79 కొలువులతో 99వ ప్రకటన -వైద్యారోగ్య శాఖలో 200 ఉద్యోగాలతో నూరవ ప్రకటన -ఇకపై ప్రతి మూడు నెలలకు ఉద్యోగ సమాచారం -అందుబాటులో ఉద్యోగ సమాచారం వెబ్ సంచిక -ప్రారంభించిన మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ప్రతిపాదనలో తెలంగాణ సివిల్ సర్వీసెస్ అమలులోకి వస్తే క్యాలెండర్ ప్రకారం ప్రకటనలు టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి వెల్లడి

TSPSCహైదరాబాద్, నమస్తే తెలంగాణ: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) తన మూడో వార్షికోత్సవం సందర్భంగా నోటిఫికేషన్లలో శతకాన్ని నమోదుచేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 79 సూపర్‌వైజర్ ఖాళీలతో 99వ నోటిఫికేషన్, వైద్యారోగ్య శాఖలో 200 ఉద్యోగాలతో నూరవ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదలచేసింది. దీంతోపాటుగా అభ్యర్థులకోసం ఉద్యోగ సమాచారం పేరుతో ఆన్‌లైన్ ఆధారిత సమాచారం అందుబాటులోకి తెచ్చింది. కమిషన్ ఏర్పడి మూడేండ్లు పూర్తవుతున్న సందర్భంగా టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ సమాచారం వెబ్ సంచికను రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సోమవారం నాంపల్లిలోని టీఎస్‌పీఎస్సీ కార్యాలయం (ప్రతిభాభవన్)లో ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ కమిషన్ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు 29,757 కొలువుల భర్తీకి 100 నోటిఫికేషన్లను విడుదల చేశామని చెప్పారు. 75 నోటిఫికేషన్లకు సంబంధించిన పరీక్షలు పూర్తి చేసినట్టు తెలిపారు. ఎక్సైజ్ కానిస్టేబుళ్ల భర్తీ ప్రక్రియ పూర్తికానుందన్నారు. 2018లో దాదాపు 3,878 కొలువుల భర్తీకి పలు నోటిఫికేషన్లు రానున్నాయని వెల్లడించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో నోటిఫికేషన్లను విడుదల చేసి, జూన్, జూలైలలో నియామక ప్రక్రియలు పూర్తిచేసేందుకు కసరత్తు చేస్తున్నామని తెలిపారు. త్వరలో గురుకులాల్లోని పీజీటీ పోస్టుల భర్తీ పూర్తిచేయనున్నట్టు చైర్మన్ వెల్లడించారు. ఆ తదుపరి టీజీటీ ప్రక్రియను చేపడుతామని చెప్పారు. డిప్యూటీ సర్వేయర్ల ప్రక్రియను జనవరిలో పూర్తి చేయనునున్నట్టు వివరించారు. అన్నిరకాల ఉద్యోగాల భర్తీలో టీఎస్‌పీఎస్సీకి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా చైర్మన్ ఘంటా చక్రపాణి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సివిల్ సర్వీసెస్ విషయం ప్రతిపాదనలో ఉందని చెప్పారు. యూపీఎస్సీ, ఆయా రాష్ర్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు సంబంధించి వేర్వేరు సిలబస్‌లు ఉండటం వల్ల అభ్యర్థులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా రాష్ర్టాల్లో ఈ సర్వీస్ ఉందని తెలిపారు. ఇటీవల జరిగిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల జాతీయ సమావేశంలో స్టేట్ సివిల్ సర్వీస్ ప్రతిపాదన వచ్చిందని చక్రపాణి వివరించారు. ఇప్పటికే ఈ విషయమై మాజీ వీసీ రామకృష్ణయ్య కమిషన్ రూపొందించిన నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి పంపించామని, అది ఆమోదం పొందగానే తగిన ప్రక్రియ చేపడుతామని చెప్పారు. స్టేట్ సివిల్ సర్వీస్ అమలులోకి వస్తే ప్రతి ఏడాది క్యాలెండర్ ప్రకారం ప్రకటనలు వస్తాయన్నారు. టీఎస్‌పీఎస్సీ వసతుల కొరత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐటీ కేంద్రం ఏర్పాటుకు అంగీకరించిందని, తగు సన్నాహాలు జరుగుతున్నాయని చైర్మన్ తెలిపారు. నూతన కార్యాలయం విషయంలో వేచిచూస్తున్నామని పేర్కొంటూ.. ఏపీపీఎస్సీ భవనం ఖాళీ చేస్తే ఆ భవనంలోకి మారేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యోగ సమాచారం తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఉంటుందని తెలిపారు. నోటిఫికేషన్ల వివరాలు, ఫలితాలు, ఏ అభ్యర్థి ఏ శాఖకు ఎంపికయ్యారు వంటి వివరాలతో ప్రతి మూడు నెలలకోమారు విడుదల చేయనున్నట్టు వెల్లడించారు. త్వరలో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నామని, ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అభ్యర్థుల సందేహాల నివృత్తి చేయనున్నట్టు తెలిపారు.TSPSC1

టీఎస్‌పీఎస్సీ పనితీరు బాగుంది

పారదర్శకత, వేగం, సాంకేతికతను ఉపయోగించుకొని ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడంతోపాటుగా అవినీతి మకిలి అంటని వేదికగా టీఎస్‌పీఎస్సీ నిలువడం సంతోషకరమని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ అన్నారు. 18లక్షల మంది అభ్యర్థులు నమోదుచేసుకోవడం ద్వారా టీఎస్‌పీఎస్సీని ఆన్‌లైన్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజీగా తీర్చిదిద్దారని అన్నారు. జాతీయ సంస్థల నుంచి టీఎస్‌పీఎస్సీకి ప్రశంసలు దక్కుతున్నాయని, ఇది తెలంగాణ ప్రజల అదృష్టమని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కీలక ఎజెండా అయిన నీళ్లు, నియామకాల విషయంలో అధికంగా కేసులు నమోదవుతున్నాయన్నారు. టీఎస్‌పీఎస్సీ విషయంలో జరుగుతున్న ప్రచారంతో నిరుద్యోగులు అపోహలకు గురికావద్దని సూచించారు. టీఎస్‌పీఎస్సీ సభ్యుడు సీ విఠల్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పథంలో నంబర్ వన్‌గా నిలుస్తుంటే.. ఉద్యోగాల భర్తీలో దేశవ్యాప్తంగా టీఎస్‌పీఎస్సీ నంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. 2004 నుంచి 2014 వరకు ఏపీపీఎస్సీ ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 25,000 ఉద్యోగాలు భర్తీచేయగా.. పబ్లిక్ సర్వీస్ కమిషన్ పది జిల్లాల తెలంగాణలో ఇప్పటికే 29,757 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేసిందని వెల్లడించారు. ఇందులో 5932 ఉద్యోగాలు భర్తీ చేయగా.. 23,953 కొలువుల భర్తీ తుది దశకు చేరిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినట్లే లక్ష ఉద్యోగాల భర్తీలో ఇప్పటికే 60 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పారు. ఇందులో 35వేల కొలువులు టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్టు వెల్లడించారు. మిగతా ఉద్యోగాలను పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్, విద్యుత్ శాఖ, సింగరేణి, ఆర్టీసీ ద్వారా భర్తీ చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వాణిప్రసాద్, సభ్యులు చంద్రావతి, రాములు, మంగారి రాజేందర్, రామ్మోహన్ రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు. TSPSC2

http://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=fd302519a0587&origin=http%3A%2F%2Fwww.ntnews.comhttps://staticxx.facebook.com/connect/xd_arbiter/r/lY4eZXm_YWu.js?version=42#channel=fd302519a0587&origin=http%3A%2F%2Fwww.ntnews.com